తేదీ 10/4/2024 రోజున నేతన్నకు అండగా బండి సంజయ్ దీక్ష కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణానికి వస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ రాక పై రాజన్న సిరిసిల్ల స్వేరో జిల్లా అధ్యక్షుడు లింగాల సందీప్ ప్రశ్నలు లేవనెత్తాడు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వస్తున్నటువంటి బండి సంజయ్ ఈ ఐదేళ్ల కాలంలో నేతన్నల సమస్యలు కనబడలేవా ఒకవేళ కనిపించిన కనిపించినట్టు ఉన్నావా, నీకే గనక నేతన్నల పైన చిత్తశుద్ధి ప్రేమ ఉంటే సిరిసిల్లలో గడపగడపకు తిరిగి నేతన్నల సమస్యలను పార్లమెంటులో వినిపించేలా చేద్దువు. ఈ ఐదేళ్ల కాలంలో కనపడని నేతన్న కష్టాలు నీ పదవి కాలం పూర్తయ్యాక కనపడ్డాయా?? మళ్లీ ఓట్ల కోసం నేతన్నల దీక్ష అని కపట నాటకాలు ఆడుతున్నావు. ఖబర్దార్ బండి సంజయ్ ఈ ఐదేళ్ల కాలంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడిన దాఖలాలు లేనే లేవు.
ఈ ఐదేళ్ల కాలంలో ఏడు నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గం కూడా అభివృద్ధి జరగలేదు. ఈ ఐదేళ్ల కాలంలో నీవల్ల 10 ఏళ్ల అభివృద్ధి ఆగిపోయింది. నువ్వు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఈ ఐదేళ్లలో విద్యార్థులకు గాని, ఉద్యోగులకు గాని, నేతన్నలకు కానీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు గాని ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనేది ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికి తెలిసిన సత్యం. ఏం మొహం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నావ్ బండి సంజయ్. నీకు గనక ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజల పైన ప్రేమ గనక ఉంటే పార్లమెంట్లో నీ గళాన్ని వినిపించి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తుండే. కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే బడ్జెట్లో కోత విధిస్తుంటే ఏడికి పోయిన మిస్టర్ బండి సంజయ్ కుమార్. కనీసం మన వాటా కూడా అడగలేని స్థితిలో ఉన్నావు. ఇప్పుడు మళ్లీ ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావ్. బండి సంజయ్ నువ్వు సిరిసిల్లలో అడుగు పెట్టాలంటే ముందుగా సిరిసిల్ల ప్రజలందరినీ క్షమాభిక్ష అడిగి అడుగు పెట్టు, రాబోవు రోజుల్లో సిరిసిల్ల ప్రజలు నీకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారు ఖబడ్దార్..