రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బెదుర రాజయ్య తండ్రి ఎల్లయ్య అను 75 సంవత్సరాల వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య అయిన బాలవ క్రిందపడి నడుము విరిగిందని బాధపడుతూ అదే బాధలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని చనిపోయాడు అని మృతుడి కొడుకు అయినా విధుల మల్లేశం ఫిర్యాదు మేరకు ముస్తాబాద్ ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.