జమ్మికుంట మండలం కొత్తపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కొత్తపల్లి గ్రామంలో మంగళవారం రోజున ఇంటింటా ప్రచారం నిర్వహించి పాఠశాలకు రాని తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను పాఠశాలకు పంపించమని కోరినారు. ప్రభుత్వము విద్యార్థులకు మధ్యాహ్న భోజనము, ఉచిత రెండు జతల దుస్తులు. మరియు ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తుందని నాణ్యమైన విద్యను అందించే ఉపాయునీ, ఉపాధ్యాయులు.పాఠశాలలో పనిచేస్తున్నారని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విన్నవిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జరీనా అంజుమా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజేందర్, రమేష్, ఐలయ్య, అవినాష్, స్వామి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


