కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని హనుమాన్ బస్తీ దగ్గర ఉన్న సర్వే నంబర్ 117 స్థలంలో అక్రమంగా తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారని బాధితుడు దుర్గం తిరుపతి వాపోయాడు. ఇందుకు పంచాయతీ కార్యదర్శిని కోరగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. గోవర్ధన్ అనే వ్యక్తి ఆక్రమించుకుని, యాదవ్ కు అమ్ముకున్నాడని విళ్ళపై కోర్టులో కేసు వేశానని కోర్టులో కేసు పెండింగులో ఉన్న భూమిని పై ఇద్దరు ఆక్రమణదారుల నుంచి చంద్రశేఖర్ తీసుకుని కొన్నిరోజులుగా ఇష్టానుసారంగా అక్రమంగా నిర్మాణం చేపడుతున్నాడని న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తంచేశారు. తన తల్లి దుర్గం రాజుబాయి గోవర్ధన్ కి 1997 లో భూమిని విక్రయించకపోయిన విక్రయించినట్లు నకిలీ వేలిముద్రలు చూపిస్తూ మా భూమి సర్వే నెంబర్ 117 నుండి 60×52 ఫీట్ల స్థలాన్ని అక్రముగా కబ్జా చేసుకుని ఇందులో నుండి 83.33 చదరపు గజాల భూమిని వనపర్తి యాదవ్ కి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారన్నారు.
ఈ అక్రమ భూ కబ్జా 2020లో వెలుగులోకి రాగా నా కన్న తల్లి దుర్గం రాజుబాయి ఈ స్థలం నేను విక్రయించలేదు ఇవి నకిలి వెలిముద్రలు అని తెలుపుతూ కోర్టులో వేసిన కేసు పెండింగ్ ఉండగా చట్టాన్ని న్యాయస్థానాన్ని గౌరవించకుండా వనపర్తి యాదవ్ అనే వ్యక్తి ఆకుల చంద్రశేఖర్ కి 2024లో విక్రయించినట్టు రిజిస్ట్రేషన్ చేయించారని కాగ సర్వే 117 నందు G+1భవన నిర్మాణ పనులు జరుపుతున్నారని కోర్టులో పెండింగులో ఉన్న మా భూమి యందు ఎలాంటి నిర్మాణాలు, పనులు జరగకుండా నిలిపివేయాలని కోరారు. సర్వే నెంబర్ 117కి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పిస్తూ 1)19-55 ఖాస్రా పహాని, SN0 117కి యొక్క పట్టా పాస్ బుక్, 2000-2001- అడంగల్ కాస్రా పహాని 2003-2004- అడంగల్ కాస్రా పహాని, 2009-2010- అడంగల్ కాస్రా పహాని, 2011-2012- అడంగల్ కాస్రా పహాని, 2012-2013- అడంగల్ కాస్రా పహాని, 2015,16,17,2018, 2020- ఐబీ ఆర్ఓఅర్, కోర్టు ఫైల్ తదితర డాక్యుమెంట్లను కార్యదర్శికి సమర్పించానని తెలిపారు.
నేను అభ్యంతరం చేసింది ఒకటి కార్యదర్శి నివేదిక ఇచ్చింది మరొక్క దానిపై
బాధితుడు దుర్గం తిరుపతి ఆన్లైన్ నెంబర్ (102/BP/GPN) సర్వే నెంబర్ 117 G+1 పై అభ్యంతరం కోరగా. కార్యదర్శి ఏమో మరొక్క G+1 ఆన్ లైన్ నెంబర్ 103/BP/2024. అని తనకు కావాలనే ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అక్రమాలకు వత్తాసు పలుకుతూ తనకు తప్పుడు నివేదికను కార్యదర్శి ఇచ్చారని ఆరోపించారు. తప్పుడు నివేదికను సమర్పించిన కార్యదర్శి పై జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని విచారణ జరిపించాలని న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనియెడల తనకు చావే శరణ్యం అని తెలిపారు.