సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్దే మా లక్షమని కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ J.రామకృష్ణ అన్నారు. మంగళవారం ఉదయం కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డ్ ఇందిరమ్మ నగర్ లో బస్తిబాటలో భాగంగా పర్యటించారు. స్థానికులతో కలిసి బస్తీలో పర్యటించిన ఆయన సమస్యలను తెలుసుకుని పరిష్కారనికి హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణ్ తో కలిసి కంటోన్మెంట్ బోర్డు నిధులు రూ .40 లక్షలతో బీరప్ప ఆలయం నుండి నాగమ్మ ఆలయం వరకు భూగర్భ మురికి కాలువ నిర్మాణం కోసం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ గతంలో బస్తిబాటలో భాగంగా బస్తీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం భూగర్భ మురికి కాలువ నిర్మాణం కోసం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వం స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు ఇవ్వలేదని, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ అభివృద్ధికి నయా పైసా ఇవ్వడం లేదని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి కంటోన్మెంట్ కు నిధులు తెస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.