హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని 6 పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ఆరు పబ్‌లపై కేసులు నమోదయ్యాయి. హలో.. టార్.. గ్రీన్ మంకిస్.. మకవ్.. లాఫ్ట్.. జీనా.. పబ్బులపై కేసు నమోదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్ణీత సమయం కంటే ఎక్కువగా పబ్బులు నడిపినందుకు కేసులు నమోదు చేయడం జరిగింది. అధిక డిసబుల్ సౌండ్‌తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.