హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ కమిషనర్ పి.విశ్వ ప్రసాద్, సూచనల మేరకు డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ బి.కె. రాహుల్ హెగ్డే, ఆదేశాలతో ఉత్తర మండల టాపిక్ 1 ఏసిపి జి.శంకర్ రాజ్ పరివేక్షణలో బోయిన్ పల్లి మార్కెట్ రహదారులపై నిత్యం వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఈ రోడ్డుపై వ్యాపారస్తులు రోడ్లు కబ్జా చేసి వ్యాపారాల నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డుపై గతంలో యాక్సిడెంట్లు జరగడం కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీనితో పలుమార్లు వాహనదారులు, స్థానికులు ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేడు బోయిన్పపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్సైలు,కే దేవీ దాస్, సాయి కృష్ణ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, కంటోన్మెంట్ సిబ్బంది, షాపులను తొలగించారు. వ్యాపారులు ఎవరైనా పుట్ పాట్ ఆనుకుని వ్యాపారాలు చేయరాదని అన్ని ట్రాఫిక్ 1 ఏసిపి జి.శంకర్ రాజ్ వ్యాపారస్తులుకు తెలియజేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్లు సదా ప్రజా సేవలో
RELATED ARTICLES


