Sunday, March 23, 2025
spot_img
HomeTELANGANAతెలంగాణ జట్టు కోఆర్డినేటర్‌కు సత్కారం

తెలంగాణ జట్టు కోఆర్డినేటర్‌కు సత్కారం

హైదరాబాద్: తమిళనాడులో జరిగిన ఎయిర్ గన్ పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ జట్టు కోఆర్డినేటర్ లక్ష్మీ చైతన్య, బంగారు పతకం సాధించిన ఎం.నాగ అక్షయలకు హైదరాబాద్ వనస్థలిపురంలోని గాయత్రి భవన్‌లో సత్కారం జరిగింది. కరూర్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ ఎయిర్ గన్ జట్టు కోఆర్డినేటర్ లక్ష్మీ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 4 స్వర్ణ, 3 కాంస్య పతకాలను తెలంగాణ జట్టు కైవసం చేసుకుంది. గాయత్రి భవన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి, గాయత్రి భవన్ సభ్యులు మహంకాళి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ఆఖరి రోజైన బుధవారం గాయత్రి భవన్‌లో లక్ష బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments