బెంగళూరు, మార్చి 9: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాల సొమ్ము తరలింపునకు సంబంధించి నాలుగు దేశాలకు వినతి లేఖలు (లెటర్స్ ఆఫ్ రిక్వెస్ట్) పంపేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి ఆ రాష్ట్రంలో కొత్తగా ‘కల్యా ణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ)’ అనే పార్టీని ఏర్పాటుచేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్, యూఏఈ, సింగపూర్, ఐల్ ఆఫ్ మేన్ దేశాలకు వినతి లేఖలు పంపేందుకు కోర్టు అనుమతిని సీబీఐ కోరింది. గాలి జనార్దన్‌రెడ్డి 2009-10లో అనుమతి ఇచ్చినదాని కంటే ఎక్కువగా 70-80 లక్షల మెట్రి క్ టన్నుల ముడి ఇనుమును అక్రమంగా తవ్వారని.. ఆ సొమ్మును ఈ దేశా ల్లో దాచినట్లు అనుమానిస్తున్నామని సీబీఐ తన దరఖాస్తుల్లో తెలిపింది.