కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా వాంకిడి మండలం పలుగ్రామాల్లో సరండి గ్రామంలో మంగళవారం ఎండ నుంచి ప్రజలకు కూసింత ఉపశమనం లభించింది. చిరుజల్లుల వాన చినికులు పడ్డాయి దీంతో చల్లటి వాతావరణం నెలకొందని ప్రజలు తెలిపారు. ఎండలు దంచి కొట్టాయి. వేడితో ఉడికిపోయారు ప్రజలు రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగాలులు కూడా విపరీ తంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. అయితే సోమవారం పగలంతా సూర్యుడి తన ప్రతాపంతో అల్లాడిస్తే.. రాత్రి మాత్రం కాస్త చల్లబడింది. మంగళవారం చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరు ములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి మామిడి, అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు రాష్ట్రంలో మంగళ, బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తా యని వాతావరణశాఖ పేర్కొంది.