రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంతో పాటుగా గొల్లపల్లిలో గల రెండు మెడికల్ దుకాణాలపై అధికారులు మెరుపు దాడులు చేసి మందుల దుకాణాలను సీజ్ చేశారు. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో గల ఆర్. ఎం. పి నాగరాజు క్లినిక్ ను ఎల్లారెడ్దిపేట ఎస్. ఐ నేరెళ్ల రమాకాంత్, ఆర్. ఐ సంతోష్ లు గొల్లపల్లిలో గల అశ్విని మెడికల్ దుకాణాలను మండల తహసీల్దార్ బోయిని రాం చందర్, ఎల్లారెడ్డి పేట రూరల్ సి ఐ బి. శ్రీనివాస్ గౌడ్, ఆర్. ఐ శ్రవణ్ ల ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు మెడికల్ దుకాణాలలో కాలం చెల్లిన మందులను, నెబులైజర్ లను స్వాదీనం చేసుకుని మందుల దుకాణాలను సీజ్ చేసి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు సారియా అంజూమ్ సమక్షంలో పంచనామా నిర్వహించి మందుల దుకాణంను సీజ్ చేశారు

