రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు సెంటర్ ల నిర్వాహకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల బస్తాలు రైస్ మిల్లు లకు తరలిస్తున్న క్రమంలో లారీలకు విద్యుత్ వైర్లు తగలకుండా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేటలో గల సింగిల్ విండో ఆధ్వర్యంలో జరుగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో కర్రను ఉతంగా చేసుకొని ప్రమాదం జరగకుండా సింగిల్ విండో సిబ్బంది కర్రను అడ్డం పెట్టి లారీలో గల వడ్ల బస్తాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కర్రను ఎత్తుకులేపుతున్న వైనం ఇది.ఇప్పటికైనా ఐకెపి, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా విద్యుత్ వైర్లను సరిచేయాలనీ రైతులు సెస్ ఏ ఈ పృథ్వీదర్ ను కోరుతున్నారు.