Wednesday, September 16, 2026
spot_img
HomeTELANGANAరాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పోతుగల్ విద్యార్థి

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పోతుగల్ విద్యార్థి

ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి భుక్య తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్–14 బాలుర SGF సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలలో పాల్గొంటున్నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తడకల శ్యాంసుందర్ తెలిపారు. విద్యార్థి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మామిండ్ల భూపతి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సురభి రాధాకిషన్ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా SGF కార్యదర్శి నర్రా శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్థులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments