అది విజయనగరంలో రద్దీ అయిన జంక్షన్. ఇటీవలే అక్కడే ఓ క్వాలీస్ వాహనం ఒ వ్యక్తిని ఢీ కొట్టడంతో అతగాడి కాలు విరిగి హాస్పటల్ పాలయ్యాడు. ఆ జంక్షన్ పేరే విజయనగరం గంటస్థంభం. తూర్పునకు శ్రీకాకుళం, రాజాం రూట్లుండగా, పడమరకు కలెక్టరేట్, ఆపై గజపతినగరంకు వెళ్లే రూటు, ఇక దక్షిణాన రింగ్ రోడ్ ఆ పై డిప్యూటీ స్పీకర్ ఇంటికి వెళ్లే రహదారి. అసలే సాయంత్రం వేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ముగ్గురు ఎస్సై లు ఉండాల్సినప్పటికీ డ్యూటీలో ఉన్నది మాత్రం ఒకే ఒక్క ఎస్ ఐ రాజు. మిగిలిన ముగ్గురు ఎస్సై లు బందోబస్తు కై కోటప్పకొండ, అనకాపల్లి వెళ్లారు. సరిగ్గా అలాంటి సమయంలోనే జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ నగరంలోకి వస్తున్నారని ఛాంబర్ ఆప్ కామర్స్ లో ఫంక్షన్ కు వెళుతున్నారని తెలియడంతో విధిగా అదీ తప్పని పరిస్థితుల్లో ట్రాపిక్ సిబ్బంది అలెర్ట్ అవ్వాలి. దాంతో గంటస్థంభం వద్ద డ్యూటీ లో ఉన్న ఒకే ఒక ఎస్సై రాజు అలెర్ట్ అయ్యారు. తన బాస్ వస్తున్నారని మ్యాన్ ప్యాక్ ద్వారా తెలియడంతో ఇక నరసింహ అవతారం ఎత్తారు. అస్సలే ముగ్గురు ఎస్సైల గైర్హాజరుతో ఆ పని భారం ఒక్క ఎస్సై పై పడటంతో ఎస్సై రాజు పోలీస్ బాస్ వెళ్లే దారిలో ఏ ఒక్క వెహికల్ లేకుండా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. అయితే ఎస్పీ వస్తున్నారన్న విషయం నగర ప్రజలకు తెలియక ట్రాఫిక్ ఎస్సై ఓవరేక్షన్ చేస్తున్నాడని వ్యాఖ్యానించడం “ఇంక్విలాబ్. టీవీ” గుర్తించింది. ఇది చూస్తుంటే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం లాగ లేదూ.. కాకపోతే ఇక్కడ ఎలక, పిల్లి రెండూ పాపం ఎస్సై రాజు అయ్యారు. ట్రాఫిక్ క్రమబద్దీకరించకపోతే బాస్ చివాట్లు తినాలి చేస్తే జనం తిట్లు తినాలి. ఇది సగటు పొలిసు పరిస్థితి కాస్త అర్ధం చేసుకోండి జనులారా వారున్నది మన భద్రతా కోసమే అని అర్ధం చేసుకోండి మరి……
ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తే ఓవరాక్షన్ అంటూ ఎస్సై రాజు పై జనం కామెంట్స్ …!
RELATED ARTICLES