రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో క్రీడా ఉత్సవాల సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఎస్పి అఖిల్ మహజాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణించాలని, విద్యార్థులకు ఆటల పట్ల ఆసక్తి కనబరచాలని ఆటలు మానసిక ఉల్లాసానికి మరో ధైర్యానికి దోహదం చేస్తాయని క్రీడల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా ఉండి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం వలన అసాంఘిక కార్యక్రమాలకు మరియు వ్యసనాలకు డ్రగ్స్ కి అలవాటు కాకుండా ఉంటుందని వాటి భారీ నుండి తమను తాము రక్షించుకుంటూ ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కట్టెల సంజన విద్యార్థిని విద్యార్థులు, ప్రజా దర్బార్ రిపోర్టర్ కట్టెల బాబు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు