రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నాలుగు రోజుల క్రితం ఉరి వేసుకొని ఓ యువకుడు మృతిచెందిన విషాద ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన బానోతు సురేష్ (28) గత నాలుగు రోజుల క్రితం ఉరి వేసుకొని చనిపోగా సోమవారం దుర్వాసన రావడంతో అటుగా వెళుతున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా మృతునికి ఇద్దరు పిల్లలు భార్య ఉంది.


