Sunday, April 27, 2025
spot_img
HomeTELANGANAకాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ₹4,00,000/- రూపాయలు చెక్కులు అందజేత…

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ₹4,00,000/- రూపాయలు చెక్కులు అందజేత…

ఈరోజు ఎలిగేడు మండలం, సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన జాతరగొండ రజిత ఓదెలు అనే కాంగ్రెస్ కార్యకర్త కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాక్ కు గురై మరణించడంతో వారికి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ₹2,00,000/- (రెండు లక్షల రూపాయల) చెక్కును మరియు సుల్తానాబాద్ మండలం, ఐతరాజ్ పల్లి గ్రామానికి చెందిన తొంటి బీరయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త కొన్ని రోజుల క్రితం మరణించడంతో ₹2,00,000/- (రెండు లక్షల రూపాయల) చెక్కును వారి వారి కుటుంబ సభ్యులకు అందించి సహాయాన్ని అందించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీమా సౌకర్యంతోని ఒక్కొక్క కుటుంబానికి ₹2,00,000 /- లక్షల రూపాయల చొప్పున రెండు కుటుంబలకు ₹4,00,000 /- లక్షల రూపాయల చెక్కులను ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. వారి కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి కుటుంబలకు అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments