-హాజరుకానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్-
రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశమైన జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీల సభ్యులు, సాధారణ, క్రియాశీలసభ్యులు అందరు సమావేశానికి హాజరయ్యేలా సమాచారం ఇవ్వాలన్నారు. సర్వసభ్యసమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని, భోజనంకు ముందు ఒక సెషన్, భోజనం తర్వాత ఒక సెషన్ ఉంటుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు హాజరై విజవంతం చేయాలని కోరారు.