ఇటీవల బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన పలువురు అధికారులు కలెక్టర్ అనురాగ్ జయంతిని బుధవారం కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఛాంబర్లో కలెక్టర్ ను జిల్లా పౌర సంబంధాల అధికారి (ఏడీ) దశరథంతో కలిసి అదనపు పౌర సంబంధాల అధికారి శారద కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సమాచారాన్ని ప్రజలకు చేర్చడంలో, ప్రజా స్పందనను ప్రభుత్వానికి చేరవేయడంలో సమాచార శాఖ కీలకం అన్నారు. జిల్లా యంత్రాంగం, అన్ని ప్రభుత్వ శాఖల నుండి మీడియా కు అధికారిక సమాచారం అందించే ప్రతినిధి సమాచార శాఖ అన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలకు సమాచారం ప్రజలకు చేర్చి ప్రతి ఒక్కరు పథక ఫలాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
నూతన జెడ్పీ సీఈఓ ఉమారాణి, డీపీఓ వీరబుచ్చయ్య, డీఆర్డీఓ శేషాద్రి లు కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమిలను కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. వారిని అభినందించిన కలెక్టర్ విధుల్లో చేరిన ఉద్యోగులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. మెరుగైన సేవలు అందించి, మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కు కలెక్టర్ సన్మానం
జిల్లాలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి గా ఉత్తమ సేవలు అందించి, బదిలీల్లో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న ఐ అండ్ పీ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ మామిండ్ల దశరథంను కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సన్మానించారు. డీపీఆర్ఓగా దశరథం జిల్లాలో అందించిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో , మీడియాలో వచ్చే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చారన్నారు. ఇక్కడ ఏపీఆర్ఓ కొప్పుల రవి, పబ్లిసిటీ అసిస్టెంట్ వాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.