తస్లిమా మహమ్మద్ మీద గిట్టనివాళ్ళ కుట్రపూరిత చర్యలో భాగంగానే లంచంని అంటగట్టే ప్రయత్నం. తన పదమూడేళ్ళ సర్వీసులో ఏ ఒక్క సందర్భంలో లంచం అనే మాటే లేకుండా తన జీతంలో సగం సోషల్ సర్వీసులకు ఖర్చు పెడుతూ ప్రతి ఆదివారం మరియు శెలవు దినాల్లో ఫార్మింగ్ కార్యక్రమాలతో రైతులకు అండగా వుంటూ వృత్తి ధర్మం నిజాయితీగ నిర్వర్తిస్తుంటే, మహబూబాబాద్ లో అవినీతికి అడ్డుకట్ట వేస్తుందని గిట్టని వాళ్ళు చేసిన కుట్ర పూరితమైన చర్య.
తస్లిమా మహమ్మద్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మనవి.. తనమీద వస్తున్న అనవసరమైన ట్రోల్ల్స్ ని నమ్మకండి..
అసలు కుట్ర వెనుకాల నిజాలేంటో త్వరలో తెలుసుకుంటారు
ములుగులో దాదాపు 13 సంవత్సరాల పాటు పని చేసి ఎలాంటి అవినీతి మరక లేకుండా పని చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందుతూ, నిత్యం అక్కడి ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహబూబాబాద్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మహబూబాబాద్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అక్కడి ఏజెంట్ల వసూళ్లను కట్టడి చేసి ఏజెంట్ల వ్యవస్థ లేకుండా ప్రయత్నం చేయడంతో మహబూబాబాద్ లో అందరి దృష్టి ఆమె మీద పడింది. గతంలో జిల్లాగా ఏర్పడిన మహాబాద్ లో భూముల రేట్లు అమాంతం పెరగడంతో అక్కడ ఏజంట్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్కడ కాంగ్రెస్ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ పలు మార్లు తస్లీమా గారికి ఫోన్ చేసి కలవండి అని అడగటం జరిగింది అని తెలుస్తుంది. కొన్ని లాండ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఎమ్మెల్యే మురళి నాయక్ పక్కా ప్లాన్ తో తస్లీమాని ఇరికించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఏసీబీ ఆఫీసర్ రిలీజ్ చేసిన వీడియోలో డబ్బులు తీసుకుంది అసిస్టెంట్ వెంకటేష్ అని ఉంది తప్ప ఎక్కడ కూడా తస్లిమా దొరికింది అని చెప్పలేదు, కేవలం కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు తస్లీమాను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి తస్లీమా ఇంట్లో కూడా 6 గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని తెలియడంతో కొంత ఆశ్చ్యర్యానికి గురి అయినట్లు తెలుస్తుంది. సోదాలలో దాదాపు లక్ష రూపాయల నగదు, 4 తులాల బంగారం మరియు తన పిల్లల పేర్ల మీద తీసుకున్న రెండు ప్లాట్లు మాత్రమే ఉన్నాయని తెలిసింది. దాంతో అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు షాక్ అయ్యి వెనుదిరిగినట్లు తెలిసింది