ఇబ్బందుల్లో ప్రయాణీకులు. ఎల్లారెడ్డి పేటలో సిరిసిల్ల ఆర్టీసి డిపో ఆధ్వర్యంలో బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన మూత్రశాలలు సాయంత్రం నాలుగు గంటలకు ముందే వాటి నిర్వాహకులు తాళం వేసి వెళ్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఎల్లారెడ్డి పేట ఆర్ టి సి బస్ స్టాండ్ లో మూత్ర శాలలు తెరచుకుని లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ప్రయాణీకులు తరచూ నాన రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్టి ప్రయానికుల ఇబ్బందులను స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు మూత్రశాలలు 24 గంటలు తెరచి ఉంచేలా చూడాలని సిరిసిల్ల ఆర్ టి సి డిపో మేనేజర్ ను కోరారు.