రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు, బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ ఎన్ రమాకాంత్ అన్నారు. నిన్న అకస్మాత్తుగా పిడుగులు పడడంతో జిల్లాలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, వర్షాలు కురుస్తున్న సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని ఈదురు గాలులకు విద్యుత్ తీగలు కూడా తెగి మీదపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాక వర్షాల దృష్ట్యా వాగులు, చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉంటాయి కావున చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు, యువత ఎవరూ వెళ్ళొద్దన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం డయల్100 సమాచారం ఇవ్వాలని అయన కోరారు.