పుట్టపర్తి సాయి దర్శనానికి ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే ఇంటినుండి సంతోషంగా వెళ్లిన మనిషీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం పుట్టపర్తి సాయి దర్శనం చేసుకుని తిరిగి వస్తారని సంబరంగా ఎదురుచూస్తున్న ఇంట ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఇంటి కుటుంబ పెద్ద దైవ దర్శన ప్రయాణంలో ప్రమాదవశాత్తు తలకు గాయలై చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన మరణం కుటుంబీకులను శోకసముద్రంలో ముంచింది. పుట్టపర్తి సాయి దర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకానికి గురైన మృతుడు మొహార్లే ధర్మయ్య (27) మృతి చెందాడు. తోటి ప్రయాణికులు చుట్టు జనం ఉండగానే ఆయన ప్రమాదానికి గురైన ధర్మయ్య హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం జీర్ణించుకోలేక పోయింది. మృతదేహం పై కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. వివరాల్లోకెళితే ఈ సందర్భంగా గ్రామ పటేల్ సెండే శంకర్, మాజీ ఎంపీటీసీ సోమేశ్వర్ గ్రామస్థులు మాట్లాడుతూ వాంకిడి మండలం తేజపూర్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు ఐనటువంటి మొహార్లే ధర్మయ్య గతరోజు 15/౦1/2024 న సంతోషంగా ప్రతి సంవత్సరంలాగా పుట్టపర్తి సాయి దర్శనానికి వెళ్తూ రైల్వేస్టేషన్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో దిగి కాచిగూడ ఎక్కంగ్గానే ప్రమాదవశాత్తు క్రింద పడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న ఆయన మంగళవారం ఇక ప్రాణాలతో లేడని తెలిసిందన్నారు. మృతునికి భార్య మమత (22) ఇద్దరు చిన్న పిల్లలు పాప వర్శిత, బాబు ప్రవీణ్ ఆరు నెలలు, మూడు నెలల చిన్నపిల్లలు సంతానం ఉన్నారని నిరుపేద కుటుంబం అని కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబం ఇంటిపెద్ద లేని అనాధ అయిందని తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణమే రైల్వేశాఖ గాని ప్రభుత్వం గాని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ వెంకటేష్, ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నారు విన్నవించారు. కన్న తండ్రి లేడని ఇక రాడని అమ్మ డాడీ కి ఏమైందని వారు అనడం మృతదేహం పై పడి కుటుంబీకుల భార్య పిల్లల రోధనలు మిన్నంటాయి. మొహార్లే ధర్మయ్య మృతితో గ్రామం తేజపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. అటుగా వార్త కవరేజ్ కోసం వెళ్తూ విషయం తెలుసుకున్న జిల్లా జర్నలిస్టులు మున్నా ఖాన్, కృష్ణపల్లి, సురేష్, మొహార్లే, ధర్మయ్య మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గ్రామస్థులు గ్రామ పటేల్ సెండే శంకర్, మాజీ ఎంపీటీసీ సోమేశ్వర్ ధర్మయ్య మృతి కుటుంబానికి ఆయన పిల్లలకు తీరని లోటని చింతించారు. ఇంటి కుటుంబ పెద్ద మరణించడంతో భార్య మమత కట్టుకున్న భర్త లేడని ఇక రాడని మృతదేహం మీద పడి రోధించడం అందరినీ కలచివేసింది. చిన్నపిల్లలను నన్ను పెట్టుకుని మమ్ములను మరచి ఎక్కడికి పోయావని దూరం చేసి వెళ్లిపోతావా ఇక మాకు దిక్కెవరంటూ ఆమె చేసిన రోదనలు చూపరులను కంటతడి పెట్టించినాయి.