వచ్చే మూ డు, నాలుగేళ్లలో అపోలో హాస్పిటల్స్ రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. మామూలుగా ప్రతి ఏడాది పెట్టే దాదాపు రూ.350 కోట్ల పెట్టుబడులకు ఇవి అదనమని అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతారెడ్డి తెలిపారు. ఈ పెట్టుబడులతో అదనంగా 2,000 పడకలను సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోంది. గురుగావ్‌లో ప్రధానంగా కొత్త పడకలు రానున్నాయి. విదేశాల నుంచి వచ్చే రోగులు ప్రీ కొవిడ్ స్థాయి కంటే 6 శాతం తక్కువగా ఉన్నారని.. ఇది ఈ ఏడాది చివరి నాటికి 10 శాతానికి చేరే అవకాశం ఉందని అపోలో భావిస్తోంది. ఆ తర్వా త 15 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.