రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్ రోడ్డు లోని సద్ధిమద్దుల సంఘం ప్రక్కన ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోకి దొంగలు బుధవారం రాత్రి ప్రవేశించి హుండి పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రతి రోజు స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు ఉదయం హుండీని గమనించి సద్ది మద్దుల సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు, సద్ది మధ్దుల సంఘం అధ్యక్షులు వంగ బాల్ రెడ్డి ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలయానికి వచ్చి హుండిని పరిశీలించి వెళ్లారు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న పురాతన శివాలయం, బాలాలయాల్లో వారం రోజుల క్రితం గుర్తుతెలియని దొంగలు చొరబడి చోరీకి విపల యత్నం చేశారు. విషయాన్ని ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు మర్చిపోకముందే శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోని హుండీలోని నగదును దొంగలు అపహరించుక పోయారు. ఈ సంఘటన తో ఆలయాలనే దొంగలు టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతుంది.