Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAప్రభుత్వ భూముల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి

ప్రభుత్వ భూముల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాకాంత్రం మరియు కబ్జాలకు సంబందించిన విషయమై ఆధారాలతో సహ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఇందులో జమ్మికుంట వ్యాప్తంగా ప్రజా సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వాలు ప్రభుత్వ అనుబంధ శాఖలకు, కమ్యూనిటీ భవనములకు, ఉపాధి కల్పన వనరులకు, జర్నలిస్టులకు, మరియు అర్హులైన నిరుపేద లబ్దిదారులకు కేటాయించారని సంబంధిత సర్వే నెంబర్లలో మిగులుగా ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూముల నుండి వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందేందుకు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారికి ఉన్న రాజకీయ ప్రోద్బలంతో సదరు భూములను వెంచర్లు, అక్రమ నిర్మాణాల కోసమై ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తు స్థానిక రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖ అధికారుల ప్రమేయంతో నిబందనలకు విరుద్ధంగా సర్వే.నం. తారు మారు చేస్తూ తప్పుడు దృవపత్రములు, అనుమతులు మంజూరు చేయిస్తు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా సరియైన లబ్ధిదారులకు కేటాయించబడిన నివేశన స్థలాలను సహితం ఆక్రమించుకొని ప్రశ్నించిన వారిపై తప్పుడు ఫిర్యాదులతో పాటు ప్రతక్ష, పరోక్ష దాడులకు దిగుతు ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోతున్న భూ కబ్జాదారులను నిలువరించే విధంగా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకమైన విచారణ కమిటిని ఏర్పాటు చేస్తు భాద్యులపైన శాఖపరమైన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని సదరు భూములను స్వాధీనపర్చుకొని ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని పూర్తి ఆధారములతో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి. కలెక్టర్ హుజురాబాద్ ఆర్.డి.ఒ ని విచారణకు ఆదేశిస్తూ నివేదికను అనుసరించి బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని మీడియాకు తెలిపిన సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి, కార్యక్రమంలో పాత సత్యం, మేడిపల్లి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments