దర్శకుడు మణిరత్నం రూపొందించిన చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ సెకండ్ పార్ట్ విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా బుధవారం అధికారికంగా ప్రకటించింది. 1955లో కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నారు మణిరత్నం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం తమిళం సహా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై విజయం సాధించింది. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, త్రిష, ప్రకాశ్‌రాజ్, జయరామ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి వంటి ప్రముఖ తారలు ఈ చిత్రంలో నటించారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.