తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు పటేల్ సంఘం సభ్యులు శుక్రవారం స్థానిక పాత బస్టాండులో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్, గ్రామ శాఖ అధ్యక్షులు బాద రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్నూరు కాపు సంఘం గౌరవ సలహాదారులు బండారి బాల్ రెడ్ది కలిసి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కావాలని ఆకాంక్షించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రులు కొండ సురేఖ, సీతక్క, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మున్నూరు కాపు ప్రధాన కార్యదర్శి వడ్నాల భాస్కర్, గ్రామ శాఖ కోశాధికారి సాన రవి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు మేగి నరసయ్య, శ్యామంతుల అనిల్, కట్టెల బాబు. సివిల్ కాంట్రాక్టర్ జవాజి లింగం, హరిదాస్ నగర్ అధ్యక్షులు శిలా అనిల్ కుమార్, యూత్ లీడర్ కాసుల రాము, ఉప్పుల రవి తదితరులు పాల్గొన్నారు.