ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోనేటి ఎల్లయ్య అనే వ్యక్తి కోనేటి పోచయ్యకు మొదటి భార్య సంతానం కాగా కోనేటి ఎల్లయ్య తల్లి మరణించగా పోచయ్య రెండో వివాహం చేసుకోవడం వల్ల ఆరుగురు కుమారులు, ఒక కూతురు సంతానం కలిగారు. పోచయ్యకు సంబంధించిన ఆస్తిని ఏడుగురికి చెందాల్సి ఉండగా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి దేవరాజు హైకోర్టులో ఆరుగురికే ఆస్తి చెందుతుందని తప్పుడు నివేదిక సమర్పించాడని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కార్యదర్శి దేవరాజు పై కోనేటి ఎల్లయ్య ఫిర్యాదు చేయగా పోలీసులు కార్యదర్శి దేవరాజు పై శనివారం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు కోనేటి ఎల్లయ్య, చిన్న కుమారుడు కోనేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్టి సామాజిక వర్గానికి చెందిన ఆస్తిని అన్యాయంగా చేసే విషయంలో మీరు ఎలా సహకరిస్తారని కార్యదర్శి దేవరాజును ప్రశ్నించడంతో నాకు అన్నీ తెలుసు నా పని నేను చేశాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని బాధితుడిని బెదిరించాడని పేర్కొన్నారు. పై విషయం పట్ల కార్యదర్శి దేవరాజును వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని అన్నారు.