నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఉదయం 10 గంటలకు ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. కాగా కార్యకర్తలు వెళ్లే బస్సుకు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జెండా ఊపడంతో బిఆర్ఎస్ శ్రేణులు నల్గొండకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా జడ్పిటిసి లక్ష్మణరావు మాట్లాడుతూ నల్గొండ భారీ బహిరంగ సభకు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వెళ్లడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ బలోపేతంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ ఓడిన బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడంలో ముందుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది బి.ఆర్.ఎస్ శ్రేణులు నల్గొండ సభకు వస్తున్నారని తెలిపారు. ఈ సభతో పార్టీలో నూతన ఉత్తేజం వస్తుందని పేర్కొన్నారు. సభకు వెళ్లిన వారిలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, ఎంపీటీసీ పందిర్ల నాగరాణి పరుశరామ్ గౌడ్, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఉన్నారు.