సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని, పానీయాలను అనుమతించాలా వద్దా అనే విషయంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. థియేటర్స్‌లోకి తినుబండాలను తీసుకెళ్లడానికి ప్రేక్షకులని అనుమతించాలని అక్కడి థియేటర్స్‌కి జమ్ము కశ్మీర్ హైకోర్టు ఆదేశించింది. దానిపై అక్కడి థియేటర్స్ యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసి తీర్పు ఇచ్చింది.
హాళ్లలోకి బయటి ఆహారం, పానీయాలని తీసుకెళ్లాలా లేదా అని నిబంధలను సెట్ చేసే హక్కు సినిమా హాళ్లకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే హలులో ఉన్నవాటిని కొనాలా లేదా అనేది ప్రేక్షకుడిపై ఆధారపడి ఉంటుందని అందులో తెలిపింది. దాని గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా హాలులోకి ‘జిలేబీ’ని తీసుకెళ్లాలనుకుంటే.. యజమాని దానికి అభ్యంతరం చెప్పవచ్చని కోర్టు తెలిపింది. ఎందుకంటే జిలేబీ తిన్న తర్వాత ఆ వ్యక్తి తన చేతులను కుర్చీకి తుడుచుకుని అనవసరంగా పాడు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అందుకే సినిమా హాల్ యజమాని అటువంటి నిబంధనలు, షరతులను పెట్టడానికి అర్హులని, అవి ప్రజాప్రయోజనాలకు లేదా భద్రతకు విరుద్ధంగా ఉండకుండా ఉండాలని చెప్పుకొచ్చింది. అలాగే హైకోర్టు తన అధికార పరిధికి సంబంధించిన పరిమితులను ఉల్లంఘిస్తోందని తెలిపింది.