రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మార్కండేయ టెంపుల్ వద్ద 106 మంది స్థానికులకు ఉచితంగా బిపి మరియు షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి 8 మంది షుగర్ ఎక్కువగా ఉన్నవారికి, ఆరుగురు బిపి ఎక్కువగా ఉన్నవారికి గవర్నమెంట్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. షుగర్ మరియు బిపి పట్ల ప్రజలలో అవగాహన కల్పించారు. లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో మద్దివేణి లక్ష్మణ్ వెయ్యి మందికి పరీక్ష చేయడానికి సరిపడా షుగర్ కిట్లను లయన్స్ క్లబ్ కు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ పయ్యావుల రామచంద్రం, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు బోయిని మహాదేవ్, పాటి దేవయ్య, పెంజర్ల దేవయ్య, పెంజర్ల రవి, మద్ది వేణి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మందికి సరిపడా షుగర్ కిట్లను అందించిన మద్దివేణి లక్ష్మణ్ కు లయన్స్ క్లబ్ వారు కృతజ్ఞతలు తెలిపారు



