ఆషాడమాసం మొదటివారం ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని గూడ్స్ ట్రాలీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట నుండి హుజరాబాద్ వెళ్లే దారి ఇందిరానగర్ లో గల దారి మైసమ్మ గుడి వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన గూడ్స్ ట్రాలీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం నుండి సుదూర ప్రాంతాలకు. పగలనకా రాత్రనకా రోడ్డు వెంట వెళ్లే క్రమంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంఘటనలు జరగకుండా ఎల్లవేళలా దారి మైసమ్మ కాపాడుతుందని అందుకు దారి మైసమ్మ తల్లికి గొర్రె పొట్టేలును బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణంలోని గూడ్స్ ట్రాలీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మరియు ట్రాలీ డ్రైవర్స్, ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు