రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటమండల కేంద్రంలోని రాచర్ల జూనియర్ కళాశాల వద్ద కరీంనగర్ కామారెడ్డి ప్రధాన రహదారిపై పోలీసులు వెహికల్ చెకింగ్ చేపట్టారు. సోమవారం సాయంత్రం కార్లు ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాలను ఆపి సోదాలు చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్టర్ కాగితాలు ఇన్సూరెన్స్ పొల్యూషన్ డాక్యుమెంట్లను పరిశీలించారు. ద్విచక్ర వాహనాల దారులు హెల్మెట్లు ధరించని వాహనదారులకు తగు సూచనలు చేసి పంపించారు. టాక్సీ కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించి వాహనదారులకు తగు సూచనలు చేసి జరీమానాలు విధించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్సై కానిస్టే బుల్స్ పాల్గొన్నారు. కామారెడ్డి వైపు వెళుతున్న ఓ కారును ఆపి పరిశీలించారు. డ్రైవర్ మద్యం సేవించాడా లేదా అనేది పైపు వేసి నిర్ధారణ చేశారు.