Thursday, October 22, 2026
spot_img
HomeANDHRA PRADESHకదిరిలో చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి జన్మదిన...

కదిరిలో చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి జన్మదిన వేడుకలు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి జన్మదిన సందర్భంగా కదిరి కాంగ్రెస్ నాయకుడు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం తెచ్చిన వైఎస్ షర్మిళా రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి చేస్తున్న ఆమె కృషికి అభినందనలు తెలుపుతూ రాష్ట్రంలో ఆమె పోరాటానికి కదిరి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో దీర్ఘాయువుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిలా రెడ్డి కడప స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, అదాని ముడుపుల వ్యవహారం, మరెన్నో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలపై చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నచ్చు బాలకృష్ణ యాదవ్, మాజీ రాష్ట్ర బీసీ సంఘం సమన్వయకర్త పట్టణ మాజీ అధ్యక్షుడు అష్రఫ్, కార్యకర్తలు జాఫర్, సాదిక్, భార్గవ్, రాఘవ, చంద్ర, మహేష్ పాల్గొని శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments