Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAసోమవారం మహబూబాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్వహణ కార్యక్రమం

సోమవారం మహబూబాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్వహణ కార్యక్రమం

మహబూబాబాద్ పట్టణ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలకు ఈనెల 12వ తేదీ సోమవారం నాడు మహబూబాబాద్ శాసనసభ్యులు డా. భు.క్య. మురళినాయక్ నాయకత్వంలో, మహబూబాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్వహణ కార్యక్రమం జరుగనున్నదని ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పొట్ల నాగేశ్వరరావు, శ్రీమతి రవళి రెడ్డి పాల్గొంటున్నారని సమావేశం మహబూబాబాద్ బ్రహ్మం గుడి ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు జరుగుతుందని పట్టణ అధ్యక్ష పదవి కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు, తమకు పంపిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, రెండు పాస్‌పోర్ట్ ఫోటోలు వెంట తీసుకుని హాజరు కావలసినదిగా కోరుతున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments