Tuesday, December 16, 2025
spot_img
HomeTELANGANAకాంగ్రెస్ పార్టీ నాయకులను కాదు! ముందు కౌశిక్ రెడ్డిని బహిష్కరించాలి: ప్రణవ్ బాబు

కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదు! ముందు కౌశిక్ రెడ్డిని బహిష్కరించాలి: ప్రణవ్ బాబు

దళిత బంధు విషయంలో పూటకో మాట మాట్లాడే కౌశిక్ రెడ్డి ముందు తాను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న ఉత్తరువు కాపీనీ చదవమని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనియ్యడం కాదు ఆదరిస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. వీణవంక మండలం బొంతుపల్లి గ్రామములో ఆయన మీడియాతో మాట్లాడుతూ చదువురాని వ్యక్తి చేసే పనులు అన్ని ఇలాగే ఉంటాయని ఎమ్మెల్యే చెప్తున్నట్టుగా ఆ లెటర్లో దళిత బంధు ఇవ్వమని, ఆపమని ఎక్కడాలేదని అందుకు సంబంధించిన డబ్బులకు వడ్డీ పడే విషయంలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు దోచుకునే అవకాశం ఉన్నందున అలాంటి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అకౌంట్ లను వెరీఫై చేసి స్టేటస్ కో మెయింటెన్ చేయమని మాత్రమే చెప్పారని తెలిపారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి జూన్ లో వచ్చిన లెటర్ ను ఇప్పుడు వైరల్ చేస్తూ దళితులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదు ముందు కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ నుంచి బహిష్కరించాలని, అసలు హుజరాబాద్ లో దళిత బంధు ఆగిపోవడానికి ప్రధానకారణం కౌశిక్ రెడ్డి అని మరోసారి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వనందుకు, దళితబంధు ఇవ్వనందుకు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వనందుకు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు గ్రామాల్లో తిరగనియ్యద్ధని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి అధికారం పోయి, పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్న వచ్చినా మారడం లేదని మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments