Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAరోడ్డు ప్రమాదంలో తలకు గాయమయి యువకుడు మృతి…

రోడ్డు ప్రమాదంలో తలకు గాయమయి యువకుడు మృతి…

శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు జమ్మికుంట మండలం జగ్గయ్య పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ధర్మ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు గురుకుంట్ల రాకేష్ మహారాజు అనే యువకుడు పని నిమిత్తం జమ్మికుంట పట్టణానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగంగా రాత్రి 9:30 గంటలకు జగ్గయ్య పల్లె గ్రామ శివారులో తన వాహనం అదుపుతప్పి కింద పడిపోగా తలకు తీవ్ర గాయాలయి రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కానీ రాకేష్ కుటుంబ సభ్యులు ఎవరో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లినట్టు అనుమానంగా ఉందని వెంటనే పోలీసులు విచారణ జరిపించి వాహనాన్ని గుర్తించి తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా చేశారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన గురుకుంట్ల రాకేష్ కుటుంబానికి ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ రీజియన్ ఇన్చార్జి శ్రీకాంత్ మహారాజ్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇటీవలే నిశ్చితార్థం జరిగిన గురుకుంట్ల రాకేష్ కుటుంబ సభ్యులకి ధర్మ సమాజ్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా తోడుగా ఉంటుందని, తను కలలు కన్నా మన స్వరాజ్యాన్ని సాధిస్తామని మాట ఇస్తున్నామని కరీంనగర్ రీజియన్ ఇన్చార్జి శ్రీకాంత్ మహారాజ్ ఒక ప్రకటనలో తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments