Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAముస్తాబాద్ మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ - మీట్ 2024 మండల స్థాయి క్రీడా...

ముస్తాబాద్ మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ – మీట్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలు.

గ్రామీణ ప్రాంత యువతలో శక్తివంతమైన సామర్ధ్యాలను వెలికి తీయడానికి, చెడు అలవాట్ల వైపు దారి మళ్లకుండా మాధకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల స్థాయిలో దోస్తీ మీట్ – 2024 క్రీడా (కబడ్డీ, వాలీబాల్ ) పోటీలు నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ మండల ఎస్సై శేఖర్ పేర్కొన్నారు. ఆసక్తి గల యువతి, యువకులు తమ తమ జట్ల వివరాలు పోలీస్ స్టేషన్ లో 22 వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని, వివరాల కోసం శ్రీనివాస్ PC 98666 49293, PC రాజశేఖర్ 9666155150 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కూడా వివరాలు తెలపవచ్చని 23 వ తేది గురువారం నుండి స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ మండల ఎస్సై శేఖర్ తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు తదుపరి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని దోస్తీ మీట్ 2024 క్రీడా పోటీలలో ప్రతి గ్రామం నుండి తప్పనిసరి ఒకటి లేదా రెండు టీములు మరియు క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.
విజేతలకు ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 5000 రూపాయలు ఇస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments