Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAనకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా: SP సురేష్ కుమార్

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా: SP సురేష్ కుమార్

అమాయక రైతులను మోసం చేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలు అని చెప్పి రైతులకు అమ్మడం ద్వారా సరైన దిగుబడి రాక రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారు. రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులతో కలిసి సమన్వయం పాటిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఈ రోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తన దుకాణాలలో తనిఖీలు చేపట్టే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేశామని రైతులకు మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా చేసి నకిలీ, కల్తీ విత్తనాలను సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని అరికట్టడంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తనాలు దుకాణాల యజమానులకు పలు సూచనలు చేశామని నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమాచారం సేకరించి వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని లైసెన్స్ లు లేకుండా దుకాణాలను నడిపినా, రికార్థులను సరైన పద్దతిలో మెయింటైన్ చేయకపోయినా, నకిలీ విత్తనాలను విక్రయించినా యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాల జారీ చేశామని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని నకిలీ విత్తనాలు ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు రవాణా కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేస్తామని అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు నకిలీ మరియు కల్తీ విత్తనాల అక్రమ రవాణాను, సరఫరాను అరికడతామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments