కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ గిరిజన, ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, డైలీవేజ్ & అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె మొదటి రోజునే డైలీవేజ్ వర్కర్ల వేతనాల బడ్జెట్ విడుదలతో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి ఇచ్చిన హామీతో తాత్కాలింగా సమ్మెను వాయిదా వేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద సమ్మె నిర్వహించగా జిల్లా గిరిజన అభివృద్ది అధికారి రమాదేవి యూనియన్ నాయకులతో జరిపిన చర్చలు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు 9నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె నిర్వహించడం జరిగిందనీ. ఈ రోజు నిర్వహించిన సమ్మె ఫలితంగా డైలీ వేజ్ వర్కర్ల వేతనాల బడ్జెట్ విడుదల అయ్యిందని, తొమ్మిది మందికి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు నియమిస్తామని వారి కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా గిరిజన అభివృద్ది అధికారి రమాదేవి అన్నారు. డైలీ వేజ్ వర్కర్ల ఇతర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్ & అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు అడ శ్యాంరావ్, జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి, జిల్లా ఉపాధ్యక్షులు కనక రవి, శ్యామలా, ప్రమీల, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు, పద్మ, మల్లికార్జున్, సంతోష్, హీరాబాయి, లతబాయి, ఇతరులు పాల్గొన్నారు