ఎక్కడైనా ప్రమాదం లేదా ప్రకృతి వైపరిత్యం సంభవించినపుడు లేదా ఏదైనా కుటుంబంలో విషాదం జరిగినపుడు. నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచంద సంస్థలు బాధితులను ఆదుకోవడం వింటూ ఉంటాం. కాని ఒక సంవత్సర కాలంగా హుజురాబాద్ లో సబ్బని వెంకట్ ఎదో ఒక రూపంలో బాధితులను ఆదుకుంటూనే వస్తున్నారు. వాస్తవానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు, స్వచంద సంస్థలు లేవు, కాని ఎక్కడ బాధ, కష్టం ఉందని తెలిస్తే అక్కడికి సహాయం వెళ్తుంది కాని ఆయన ఎక్కడ వినిపించడు, కనిపించడు. కాని ఈ సారి అనూహ్యంగా ఆయనే ప్రకటన ఇచ్చారు. ఇన్ని నెలలు జరిగింది ఒక ఎత్తు, నిన్న ప్రమాదం ఒక ఎత్తు. ప్రమాదం జరిగిన కేవలం 2 గంటలలోనే స్పందిచడమే కాకుండా, పరిహారం కూడా ప్రకటించి స్థానిక నాయకులను ఉలిక్కిపడేలా చేసి, వారి చేత కూడా ప్రకటన చేయించేలా వారికీ తప్పని పరిస్థితి కల్పించారు, ఈ విషయం అంతా గమనిస్తున్న నియోజకవర్గ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హుజురాబాద్ పట్టణంలోని, అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం 15-07-2024, అర్ధరాత్రి ఆకస్మాతుగా సంభవించిన షార్ట్ సర్క్యూట్ వలన జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చిరు వ్యాపారులైన పండ్లబండ్ల దుకాణాలన్నీ దగ్ధం అయి బూడిదగా మారాయి. వ్యాపారులకు చెందిన తోపుడు బండ్లు, గుడారాలు, మరియు ఇతర వ్యాపార సామాగ్రి పూర్తిగా దగ్ధం అయినవి.
రాత్రి 12 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. హుజురాబాద్ లో జరిగిన ప్రమాద విషయం ఉదయం 2 గంటలకు హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ సామాజిక వేత్త మరియు Genpact వైస్ ప్రెసిడెంట్ ” సబ్బని వెంకట్” కు తెలిసిన వెంటనే వ్యాపారులకు తన సానుభూతిని తెలియచేసారు. తక్షణమే బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని మంగళవారం ఉదయం 3 గంటలకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం ప్రకటించారు. సమయాభావం వల్ల రాలేకపోతున్నానని బాధను వ్యక్తపరుస్తూ, ఈ వారంలో 18 వ తేదీన స్వయంగా వచ్చి బాధితులను కలుస్తాను అని తెలిపారు.

