రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన 1).ఎగదండి రాజు, తండ్రి రాజయ్య, 2) ఎగదండి సాయి ప్రసన్న, భర్త రాజు మరియు 3).ఎగదండి నర్సింలు తండ్రి రాజయ్య, 4). ఎగదండి సుజాత భర్త నరసింహులు, 5). ఎగదండి పద్మ భర్త జగదీష్, కులం ఎస్సీ అనువారు తల్లితండ్రులు సంపాదించిన ఆస్తి పంపకాల విషయంలో గత కొంతకాలంగా గొడవలు పెట్టుకోని ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు పిఎస్ లో కేసులు కూడా పెట్టుకున్నారు. అయినప్పటికీ మారకుండా 29.04. 2024 రోజున ఉదయం 11:30 నిమిషాలకు యధావిధిగా ఇరు వర్గాల వారు కోరుట్లపేట గ్రామంలో ఒకరికొకరు కొట్టుకొని, రోడ్డుపై న్యూసెన్స్ చేయడంతో పాటు, చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారని సమాచారం మేరకు కోరుట్ల పేట గ్రామ పోలీస్ అధికారి అయిన, కానిస్టేబుల్ సతీష్ వారి పై దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ ఎన్ రమాకాంత్ పై ఐదుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపినారు.