భారత విద్యార్థి ఫెడరేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్ట్ విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు, విద్యార్థులలో పోటీతత్వాన్ని నెలకొల్పేందుకు, రానున్న పరీక్షలకు సన్నద్దం చేసేందుకు, టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని TPTF నాయకులు ఓ ఎల్లారెడ్డి, DTF మండల అధ్యక్షులు లక్ష్మణ్ STU మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. అనంతరం SFI టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని అవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం కావాలని, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఇటువంటి టాలెంట్ టెస్ట్ లు ఉపయోగపడతాయని, ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ అభినందనీయం అని అన్నారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ మాట్లడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్ట్ విజయవంతం అయ్యిందని జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నిర్వహించే టాలెంట్ టెస్ట్ ను ఉపయోగించుకున్నారని రానున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసి వారి లోపల ఉన్న భయాన్ని పోగొట్టేందుకే ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం ఇలాంటి టాలెంట్ టెస్ట్ పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తుందని ఇట్టి పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అంబాడీ రవీందర్ పాల్గొన్నారు.