Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAరియాజ్ ఎన్ కౌంటర్ ఒక గుణపాఠంగా ముస్లిం యువత సన్మార్గంలో నడవాలి: అహ్మద్ ఖాన్.

రియాజ్ ఎన్ కౌంటర్ ఒక గుణపాఠంగా ముస్లిం యువత సన్మార్గంలో నడవాలి: అహ్మద్ ఖాన్.

తెలంగాణలో పోలీసుల చేతుల్లో ఎంకౌంటర్ చేయబడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన రియాజ్ చావు ద్వారా ముస్లిం యువత ప్రవక్త మహమ్మద్ వారి బోధనలు ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం సన్మార్గంలో నడవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.

ముస్లిం సమాజంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం వల్ల కొంతమంది తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటూ కన్నవాళ్ళకు కడుపు కోతల్ని మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం యువత చదువుపై దృష్టి పెట్టి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకొని ఇస్లాం ప్రకారం మహమ్మద్ ప్రవక్త మార్గంలో నడుస్తూ అందరితో సోదర భావంతో, స్నేహభావంతో, క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగించాలని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా రాజ్యం ఎప్పుడూ ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటూ, ముస్లింలను అణచివేసే ధోరణితో, ముస్లింల ప్రాణాలను హరించే పనిలో, ఆస్తులను సర్వనాశనం చేసే పనిలో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం RSS ఎజెండాను అమలు చేస్తూ ముస్లింలను అణచివేసే పనిలో ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకొని, క్రమశిక్షణతో ప్రజాస్వామ్య బద్ధంగా నడవాలని సమాజ సేవలో రాణించాలని రాజకీయంగా ఎదగాలని జీవితంలో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని మార్గనిర్దేశనం చేశారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బాగా చదివించి సరైన మార్గంలో నడిచే విధంగా చూసుకోకుంటే మీకు కడుపు కోతే మిగులుతుందని అన్నారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నేరప్రవృత్తి ఎప్పటికీ ప్రమాదమనే విషయాన్ని ఇటు తల్లిదండ్రులు, అటు యువకులు రియాజ్ చావు ద్వారా నైనా గుర్తించాలని కోరుతున్నానన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments