రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంకు చెందిన రంగు రమేష్(42) ఆదివారం నాడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించాడని ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తన భర్త చనిపోయాడని భార్య వసంత తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు రమేష్ ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం నాడు స్నానం చేసి జి ఐ వైరు పై తడి బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై పడిపోయాడు. బ్రతికి ఉన్నాడన్న ఉద్దేశ్యంతో వెంటనే అంబులెన్స్ లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.