జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామం నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం జమ్మికుంట పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద పెట్టి వస్తున్న బ్లూ కోల్ట్ సిబ్బంది విధులను ఆటంకపరిచి ఇసుక ట్రాక్టర్లను విలాసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తులు తీసుకువెళ్లారని జమ్మికుంట పట్టణ సిఐ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వరగంటి రవి మాట్లాడుతూ, విలాసాగర్ మానేరు పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా విలాసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని పోలీస్ స్టేషన్ కు అందిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది బ్లూ కోల్ట్ సిబ్బంది పట్టణంలోని కాకతీయ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పార్కింగ్ చేస్తున్న సమయంలో పోలీస్ సిబ్బంది విధులను ఆటంకపరుస్తూ ఇసుక ట్రాక్టర్లను విలాసాగర్ ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు తీసుకువెళ్లినట్లు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. విధినిర్వహణలో ఉన్న పోలీసు విధులను ఆటంకం కల్పిస్తూ ఇసుక ట్రాక్టర్ తీసుకువెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి ఆదేశాల మేరకు పీడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని వారు తెలిపారు. ఇసుక ట్రాక్టర్లను తీసుకెళ్లిన వారి గురించి ఎంక్వయిరీ చేస్తున్నామని తీసుకు వెళ్లినవారు పరారీలో ఉన్నట్లు పోలీసులు వారికోసం వెతుకుతున్నారని త్వరలోనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని సీఐ వరగంటి రవి. తెలిపారు.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్ ఇంక్విలాబ్ టీవీ న్యూస్ ఛానల్