రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ నూకలమర్రిలో కల్తీ కల్లు తాగి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వేములవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించిన రూరల్ ఎమ్మార్వో పాలకుర్తి రవి. ఇందులో రంగంపేటకు చెందిన భూక్య ప్రకాష్. నూకలమర్రికి చెందిన సోమినేని శ్రీనివాస్, భూక్య తిరుపతి, హనుమాజీపేట, గుగులోతు రాజు, బి సురేష్, గుగులోతు రాజు తండ్రి పంతులు నాయక్ లను వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడికి రూరల్ ఎస్సై మారుతి, సిఐ శ్రీనివాస్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. వేములవాడ రూరల్ ఎమ్మార్వో హాస్పిటల్ కి వచ్చి డాక్టర్లను పరిస్థితి తెలుసుకున్నారు. ఇందులో ఇద్దరు తీవ్రమైన అస్వస్థతకు గురైనారు