Friday, May 22, 2026
spot_img
HomeTELANGANAభూకబ్జాలపై మహబూబాబాద్ MLA, MP ల మౌనం ఎందుకు?

భూకబ్జాలపై మహబూబాబాద్ MLA, MP ల మౌనం ఎందుకు?

మహబూబాబాద్ పట్టణంలో ఒక ముస్లిం కుటుంబం తమపట్టా భూమిలో తాము పనులు చేసుకుంటూ ఉంటే భూకబ్జాదారులు తమపై దాడికి యత్నిస్తున్నారని దాదాపు పది నెలలుగా మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో 10కి పైగా ఫిర్యాదులు చేసినప్పటికీ, టౌన్ పోలీసులు పట్టించుకోకపోవడం మహబూబాబాద్ లో చర్చనియాంశంగా మారింది. మహబూబాబాద్ నియోజకవర్గంలో ముస్లింలంతా ఒక్క తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలకు ఓట్లు వేసి గెలిపించారు. మహబూబాబాద్ కు బాస్ అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్లింల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న BRS పార్టీ నాయకులను చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారో, వారిపై చర్యలు తీసుకోమని పోలీసులను ఎందుకు ఆదేశించడంలేదో? దీని వెనుక “మతలబు” ఏమిటో మహబూబాబాద్ ప్రజలకు అంతుచిక్కటం లేదు.

సహజంగా ముస్లిం కుటుంబంలోని ఆడవాళ్లు బయటికి రారు. అలాంటిది 86 ఏళ్ల వృద్ధ ముస్లిం మహిళ రెండుసార్లు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ, టౌన్ పోలీసులు కనీసం నిందితులను 10 నెలలుగా ఒక్క సారి కూడా పోలీస్ స్టేషన్ కు పిలవక పోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోకూడదని పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తుంది ఎవరు? ఈ తతంగమంతా ఎమ్మెల్యే, ఎంపీలకు తెలియకుండా జరుగుతుందా? తెలిసి జరుగుతుందా? 9నెలలక్రితం బాధిత కుటుంబం మహబూబాబాద్ లో ఒకసారి ప్రెస్ మీట్ కూడా పెట్టి తమ బాధను ప్రపంచానికి తెలియజేసింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన విషయం ఎమ్మెల్యే కి తెలుసు. బాధిత కుటుంబం నాలుగైదు నెలల క్రితం ఎమ్మెల్యే కు సైతం తన బాధను చెప్పుకుంది. DCC అధ్యక్షురాలు అయిన ఎమ్మెల్యే భార్యకు కూడా ఈ విషయం పూర్తిస్థాయిలో తెలుసు. అయినప్పటికీ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచన MLAకు, డి.సి.సి. అధ్యక్షురాలికి ఎందుకు కలగటం లేదు భాఉ కబ్జా దారులతో వీళ్ళు కమ్మకు అయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశవ్యాప్తంగా ముస్లింలపై విద్వేషం పెరిగినవేళ ముస్లింలకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు ఎందుకు మౌనముద్రలో ఉన్నారు. తమ కార్య క్షేత్రంలో ముస్లింల ఆస్తులపై దాడులు జరుగుతుంటే ఆదుకోవాల్సిన బాధ్యత వీరికి లేదా? అంటూ నియోజకవర్గ ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు మాపై దాడులు జరిగిన కూడా ఎమ్మెల్యే సహాయం చేయరనే అసంతృప్తిలో నియోజకవర్గ ముస్లిం సమాజం ఉంది.

బాధిత కుటుంబం 10 నెలలుగా నిరంతరంగా పోరాటం చేస్తూ ఉంటే పట్టణంలోని ముస్లింలు, ఇతర వర్గాల్లో ఆ కుటుంబం పై సానుభూతి పెరుగుతుంది కానీ నియోజకవర్గానికి బాస్ అయిన ఎమ్మెల్యే మనసు మాత్రం కరగడంలేదు. ఎమ్మెల్యే ధోరణితో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఎంపీ సైతం ఈ విషయంపై దృష్టి సారించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని మహబూబాబాద్ ప్రజలు కోరుతున్నారు.

ఈ విషయంలో B.R.S. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం స్పందించి, నిజ నిజాలు తెలుసుకొని దాడులకు పాల్పడుతున్న తమ పార్టీ నాయకులపై చర్యలు తీసుకొని ముస్లిం కుటుంబానికి న్యాయం చేయాలని పట్టణంలోని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments