ఎల్లారెడ్డిపేట మండలం సముద్రలింగపూర్ తుర్కషి కాలానికి చెందిన మహిళ మరణానికి కారణం అయిన RMP జజ్జరి దేవేందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట్ మండలం తుర్క కాసి కాలనీ, సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాసింబి అనే మహిళకు 26 12 2024 రోజున జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ అయిన జజ్జరి దేవేందర్ వద్దకు వెళ్లగా RMP దేవేందర్ ఖాసింబిని పరిశీలించి ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇవ్వగా మరునాడు జ్వరం తగ్గకపోయేసరికి మరల దేవేందర్ వద్దకు తీసుకొని వెళ్లగా ఖాసింబికి సెలైన్ లు పెట్టగా స్పృహ కోల్పోయిన ఖాసీంబిని బంధువులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ 28 12 2024 రోజున మరణించినదని డాక్టర్లు తెలపగా, RMP నిర్లక్ష్యం మేరకు తన భార్య చనిపోయిందని ఖాసింబి భర్త అయిన మహమ్మద్ అజిమ్ ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేట్జిన్ లో పిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేసి RMP దేవేందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.


